తెలంగాణవీణ, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన బీఆర్ఎస్ నేత కవిత గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. నాటి ఇంటర్వ్యూకు సంబంధించిన ఎడిటెడ్ వీడియోను బీజేపీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ కవితతో మాట్లాడుతూ.. ఒకవేళ మీరు సీఎం అయితే కచ్చితంగా అమలు చేసే నిర్ణయం ఏమిటని ప్రశ్నించారు. దీనికి కవిత స్పందిస్తూ తాను లిక్కర్‌పై నిషేధం విధిస్తానని అన్నారు. ఇలా చేస్తే నష్టమొస్తుందని అంతా అంటారుగానీ తాను చేయగలిగితే మాత్రం మద్యంపై నిషేధం విధిస్తానని అన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టు నేపథ్యంలో బీజేపీ ఈ వీడియోను నెట్టింట పంచుకుంది.
Tweetఏ లిక్కర్ దందా చేసి కొంపలు కట్టుకున్నారో,
— BJP Telangana (@BJP4Telangana) March 17, 2024
ఆ లిక్కర్ దందానే కొంప ముంచింది!!#DelhiLiquorPolicyCase #DelhiLiquorScam pic.twitter.com/XgB9Jp5YG9