తెలంగాణవీణ, హైదరాబాద్ : కాంగ్రెస్‌లో చేరికపై ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. కాంగ్రెస్‌లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తనపై వస్తున్న వదంతులు, జరుగుతున్న ప్రచారం మొత్తం అవాస్తవమని కొట్టిపారేశారు. కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి పోటీ చేయబోతున్నానని కూడా తనపై ప్రచారం జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం తనకు ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదని తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు స్పష్టం చేశారు. బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతున్నానని వెల్లడించారు. కాగా, రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైందని వార్తలు వినిపించాయి. ఈనెల 18న ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరిగింది. గ్రేటర్లో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో దానం నాగేందర్‌ను చేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇస్తోందని అనుకున్నారు. అనూహ్యంగా దానం స్పందించి బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ప్రకటించడంతో పుకార్లకు చెక్ పడినట్లయింది.