తెలంగాణ వీణ, ఏపీ బ్యూరో : 123వ జయంతి సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మంత్రి కాకాణి. అమరజీవి పొట్టి శ్రీరాములు కి నెల్లూరు జిల్లాతో ఉన్న అనుబంధంతో, ఆయన పేరుతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా జిల్లాకు పేరు రావడం జిల్లా వాసులుగా మనకెంతో గర్వకారణం అని పేర్కొన్నారు . శ్రీ పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా నగరంలోని డైకస్ రోడ్ లో గల మంత్రి క్యాంపు కార్యాలయంలో అమరజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి
ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఆయన స్ఫూర్తితో దేశంలో ఎన్నో సరికొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆయన ప్రాణత్యాగం పలితమేనన్న మంత్రి కాకాణి. తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం చేపట్టి, నిరాహార దీక్షతో ప్రాణాలను పణంగా పెట్టి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన గొప్ప వ్యక్తి, తెలుగువారు జీవితాంతం రుణపడి ఉండాల్సిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు . ఆ మహనీయుని ఆదర్శాలను గౌరవిస్తూ, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, అందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంగా నూతనంగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి