Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కిరణ్ అబ్బవరం, రహస్య నిశ్చితార్థం.. ఫొటోస్ వైరల్

Must read

తెలంగాణ వీణ , సినిమా : కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్‌ల ఎంగేజ్మెంట్ బుధవారం (మార్చి 13) ఘనంగా జరిగింది. రాజా వారు రాణి గారు సినిమాతో కిరణ్ అబ్బవరం, రహస్యలు తెరపైకి వచ్చారు. ఆ సినిమా ప్రయాణంలోనే మొదలైన స్నేహం ప్రేమగా మారింది. ఈ నాలుగైదేళ్లు రహస్యంగా ఈ విషయాన్ని ఉంచారు. కానీ కిరణ్ అబ్బవరం రహస్యల డేటింగ్, ప్రేమ వ్యవహారం మీద ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే వచ్చింది. ఆ రూమర్లే ఇప్పుడు నిజం అయ్యాయి.కిరణ్ అబ్బవరం, రహస్యల ఎంగేజ్మెంట్ అంటూ రెండు మూడు రోజుల నుంచి నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతూనే వచ్చాయి. బుధవారం నాడు బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక ఉంటుందని చెప్పుకొచ్చారు. చాలా ప్రైవేట్‌గా ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారని, ఎటువంటి ఆర్భాటాలకు వెళ్లడం లేదని అన్నారు. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం, రహస్యల ఎంగేజ్మెంట్ ఫోటోలు, వీడియోలు అయితే నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి.కిరణ్ అబ్బవరం, రహస్యల పెళ్లి ఆగస్ట్‌లో ఉంటుందని సమాచారం. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్న కిరణ్ అబ్బవరం.. ఈ లోగా తన కమిట్మెంట్లను పూర్తి చేసి, సినిమాలన్నీ కంప్లీట్ చేసి పెళ్లి పీటలపై కూర్చోనున్నాడు. ఆ తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇస్తాడని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటలేకపోతోన్నాడు. డిజాస్టర్లతో కిరణ్ అబ్బవరం తన అభిమానుల్ని నిరాశ పర్చుతున్నాడు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం ఓ పీరియాడిక్ డ్రామాను చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you