తెలంగాణ వీణ , హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం హైదరాబాద్ కు రానున్నారు..పది రోజుల వ్యవధిలో మోదీ రెండోసారి రాష్ట్రానికి వస్తున్నారు. మూడు రోజుల పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం మల్కాజ్‌గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు రోడ్ షోకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్‌గిరి వరకు మోదీ రోడ్ షో జరగనుంది. మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలో 1.3 కి.మీ. మేర ప్రధాని రోడ్ షో జరుగుతుంది. అలాగే 16న శనివారం నాగర్‌కర్నూల్‌లో మోదీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 18న జగిత్యాలలో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు..