తెలంగాణవీణ, జాతీయం : జాతీయ స్థాయిలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తుల గడువును కేంద్రం పొడిగించింది. నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష ఆన్ లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 16 వరకు పొడిగిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) ప్రకటించింది. దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నందున గడువు పొడిగిస్తున్నట్టు ఎన్ టీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్షను ఎన్ టీఏ మే 5న నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు exams.nta.ac.in వెబ్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని ఎన్ టీఏ సూచించింది. వాస్తవానికి ముందు షెడ్యూల్ లో పేర్కొన్న ప్రకారం నీట్ యూజీ పరీక్షకు దరఖాస్తుల గడువు మార్చి 9వ తేదీతో ముగిసింది. అయితే, దరఖాస్తులు వెల్లువెత్తడంతో మార్చి 16వ తేదీ రాత్రి 10.50 నిమిషాల వరకు గడువు పొడిగించింది.