తెలంగాణవీణ, అంతర్జాతీయం : ఆఫ్రికా దేశం టాంజానియా సమీపంలోని జాంజిబార్ దీవుల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 78 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారిలో ఒక మహిళ, 8 మంది చిన్నారులు ఉన్నారు. తాబేలు మాంసం తిన్నందువల్లే వారంతా ప్రాణాలు కోల్పోయినట్టు ల్యాబ్ టెస్టుల్లో నిర్ధారణ అయింది. జాంజిబార్ ప్రజలకు తాబేలు ఇంతో ఇష్టమైన ఆహారం. 2021లోనూ ఇక్కడ తాబేలు మాంసం తిని ఏడుగురు కన్నుమూశారు. తాజాగా, మరోసారి అలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో, సముద్ర తాబేలు మాంసం తినవద్దంటూ ప్రజలకు అధికారులు సూచన చేశారు.