తెలంగాణ వీణ , ఉప్పల్ : చర్లపల్లి డివిజన్ అమృత్ భారత్ కార్యక్రమం లో భాగముగా 554 రైల్వే స్టేషన్ ల పునరాభివృధికి 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జిల శంకుస్థాపన కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్రమోది చేపట్టారు, అందులొ భాగంగా ఈ రొజు పెద్ద చర్లపల్లి నుంచి చెంగిచెర్ల వైపు వెళ్లే రహదారిపై రైల్వే బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమం ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి చెతులమీదగా ప్రారంభమయింది. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మేల్యే ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్ మరియు చర్లపల్లి డివిజన్ స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి,మల్లాపుర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ,హోసింగ్ బోర్డు కార్పొరేటర్ ప్రభుదాస్ ,నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజేన్ శేకర్ ,చిలకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ,రామాంతపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు ఆలాగే బిఆర్ఎస్ ముక్య నాయకులు ,నాయకురాలు ,కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు,