- సౌకర్యాలపై ఎమ్మెల్యే కలెక్టర్కు వినతిపత్రం
- కనీస వసతుల కల్పనకు హామీల పర్వం
తెలంగాణ వీణ, భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణ అభివృద్ధికై స్థానిక చిరు వ్యాపారులు నడుంబిగించారు. కొత్తగూడెం పట్టణంలో కనీస సౌకర్యాలతో పాటు ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధి పనులను చేపట్టాలని చిరు వ్యాపారులు కంకణం కట్టుకొని అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ వారికి అభివృద్ధి గురించి సూచనలను చేస్తున్నారు. గతంలో కూడా చిరు వ్యాపారులు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు అధికారులకు ప్రజల సదుపాయాల గురించి వినతి పత్రాలు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం కొత్తగూడెం చిరు వ్యాపారస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ప్రయత్నంలో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలని మర్యాదపూర్వకంగా కలిసి అభివృద్ధికై విన్నవించారు. వినతిపత్రం ఇచ్చిన నేపథ్యంలో
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మన ఊరు అభివృద్ధికి తప్పకుండా ప్రభుత్వ పరంగా అన్ని శాఖల అధికారులతో మాట్లాడి వ్యాపారులకు అన్ని సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కొత్తగూడెంలో వ్యాపారస్తులు ఈ విధముగా ఊరు ప్రయోజనాల కోసం, చిరు వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం కృషి చేయడం హర్ష నియమన్నారు. కలెక్టర్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులతో సింగరేణి అధికారులతో మాట్లాడి తప్పకుండా కొత్తగూడెం పట్టణ అభివృద్ధికి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిరు వ్యాపారాలు పాల్గొన్నారు.