తెలంగాణ వీణ, కుత్బుల్లాపూర్: ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పత్రికలు పనిచేస్తాయని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరధి లోని జీడిమెట్ల పి ఎస్ లో GS 9 టీవీ మరియు తెలంగాణ వీణ డైలీ దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జీడిమెట్ల సిఐ శ్రీనివాస్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏ ఒక్క పార్టీ, వర్గానికి కొమ్మ కాయకుండ ప్రజల పక్షాన నిలబడి నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగుతున్నందు వల్లే GS 9 టీవీ మరియు తెలంగాణ వీణ డైలీ దినపత్రిక ను క్యాలెండర్ కు విశేష ప్రజాధరణ వచ్చిందన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా నిత్య నూతనంగా కథనాలను ప్రచురిస్తూ, ప్రతి వ్యక్తిని తట్టి లేపుతుందన్నారు. పత్రికలలో పనిచేసే జర్నలిస్టులకు పత్రికలకు కూడా స్వేచ్ఛ ఉండాలని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను వెలికి తీయడంలో ముందున్న GS 9 టీవీ మరియు తెలంగాణ వీణ డైలీ దినపత్రిక యాజమాన్యానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడిమెట్ల ఎస్ఐ హరీష్, ఎస్ ఐ
సతీష్, సుభాష్ నగర్ డివిజన్ పోలా శ్రీకాంత్, సూరారం డివిజన్ ఉప్పల భాస్కర్,
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం GS 9 టీవీ రిపోర్టర్ శ్యామల.వెంకటేష్ పాల్గొన్నారు.