తెలంగాణ వీణ, ములుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారక్క సన్నిధిలో ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం ఏర్పరచాలని కోరుతూ కరపత్రాన్ని పూజార్ల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు తుడుం దెబ్బ ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించినారు ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజలు బిక్షపతి గౌడ్ అధ్యక్షతన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ గారు మాట్లాడుతూ ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయాలని ఇది న్యాయమైన డిమాండ్ అని వారు అన్నారు గత ప్రభుత్వం గద్వేల్ కు జోగులాంబ అని సిరిసిల్లకు వేములవాడ రాజన్న అని భువనగిరికి యాదాద్రి అని కొత్తగూడెంకు భద్రాద్రి అని భూపాలపల్లి బొందల గడ్డ కు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ పేరు ఈ విధంగా దేవతల పేర్లు మహనీయుల పేర్లు పెట్టిన కేసీఆర్ ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం మరిచిపోయారు ఇది కొట్లాడి తెచ్చుకున్న ములుగు జిల్లా ఉద్యమ పోరాట ఫలితమే ములుగు జిల్లా 23వ తేదీన రేవంత్ రెడ్డి సమ్మక్క సారక్క సన్నిధికి వస్తున్న సందర్భంగా ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క సన్నిధిలోనే ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయాలని వారు కోరారు భారత్ జూడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి సమ్మక్క సారక్క సన్నిధి నుండి ఫిబ్రవరి 6 నుండి 2023లో పాదయాత్ర చేసినారు అప్పుడు మేము అధికారం లోనికి వస్తే ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేస్తామని హామీ ఇచ్చినారని వారు అన్నారు ఇచ్చిన హామీని అమలు చేయాలని వారు కోరారు ఈ కరపత్రావిష్కరణలో పాల్గొన్న నాయకులు తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు వట్టం జనార్ధన్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర నాయకులు నంగారభేరి రాష్ట్ర కార్యదర్శి పోరిక ఉదయ్ సింగ్ శ్రీనన్న నవీన్ వేణు తుడుం దెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి చింత కృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కబ్బాక శ్రవణ్ ఆదివాసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోదేం కృష్ణ ప్రసాద్ చంద మహేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాతీయ కన్వీర్ పి రత్నం తదితరుల ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది