తెలంగాణ వీణ, ఉప్పల్ : మరోసారి మోడీ సర్కార్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తును మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం హబ్సిగూడ డివిజన్ వెంకటరెడ్డి నగర్ లో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తుళ్ల వీరేందర్ గౌడ్ హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ గోడ మీద పెయింటింగ్ వేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్ధవంతమైన నాయకత్వంలో సుపరిపాలన అభివృద్ధిని నెరవేర్చడానికి రాబోయే ఎన్నికలలో బీజేపీని చారిత్రాత్మక విజయాన్ని అందిచాలని కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు