తెలంగాణ వీణ,ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ డివిజన్ లోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో ఈనెల 11వ తారీఖు నాడు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి సోమవారం సైనిక్ పూరి లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కలవడం జరిగింది. అలాగే బండారి నీలం రెడ్డి కి, నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ కి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబటి జగదీష్ ముదిరాజ్, గజ్జెల సత్యరాజ్ గౌడ్, వీరబ్రహ్మేంద్రస్వామి కమిటీ అధ్యక్షులు బత్తోజు సోమ నరసింహ చారి, ప్రధానకార్యదర్శి కొత్తోజు పరిపూర్ణాచారి, కోశాధికారి నీలకంఠం చారి, జాయింట్ సెక్రెటరీ చింతపట్ల బ్రహ్మచారి, కమిటీ ప్రధాన సలహాదారులు కనపర్తి రామ రత్నం చారి, శశిధర్ శిల్పి, కంచోజు సుదర్శన్ చారి, ఆలయ కమిటీ సభ్యులు పోలోజు ధనుంజయ చారి, గొల్లపల్లి సత్యనారాయణ, గంధాల భీష్మాచారి, శివకోటి శ్రీధర్, పబ్బోజు పాండు చారి , రమంచెర్ల బలరాం, ఎక్కలదేవి నర్సింలు తదితరులు పాల్గొన్నారు,