తెలంగాణవీణ, కాప్రా : వీర శైవ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన సంవత్సర 2024 క్యాలెండర్ ను కాప్రా విజయ హై స్కూల్ లో ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు స్వర్ణ రాజ్ శివమణి, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. వీరశైవుల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. అదేవిధంగా సామూహిక కార్యక్రమాలు నిర్వహించేందుకు బసవ భవన్ ఏర్పాటుకు సహకరిస్తానన్నారు. వీరశైవ సాంప్రదాయం ప్రకారం వీరశైవులకు అవసరమైన ప్రత్యేక స్మశాన వాటిక ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, విజయ హై స్కూల్ కరస్పాండెంట్స్ కుప్పునూరు రాజేష్, కొప్పునూరు ప్రవీణ్, నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కొత్త అంజిరెడ్డి, సుడుగు మహేందర్ రెడ్డి, కాసం మైపాల్ రెడ్డి, బన్నాల ప్రవీణ్, భద్రుద్దీన్, కెసిసి సంజీవరెడ్డి, బైరీ భాస్కర్ గౌడ్, మహేష్ గౌడ్, నవీన్ గౌడ్, వీరశైవ పెద్దలు యావపురం విశ్వనాథం, గంగా ఈశ్వరయ్య, శశి కుమార్, సమాజా అధ్యక్షుడు దేశాయి బండే గౌడ, వుల్లెం బాల్రాజ్, యావాపురం రవి, జ్ఞానేశ్వర్, శివానంద్, శంభు లింగం, మాన్కరి శివ, మఠం శివ కుమార్, రామ్ భద్రయ్య, భీమశంకర్, సిద్దేశ్వర్, గిరిజాపతి, భద్రయ్య, మహేష్, రంశెట్టి తదితరులు పాల్గొన్నారు.