తెలంగాణవీణ , హైదరాబాద్ : మాజీ ఎం ఎల్ ఏ మైనంపల్లి హనుమంత రావు, అతని కుమారుడు మెదక్ శాసన సభ్యుడు మైనంపల్లి రోహిత్ రావు కుటుంబ సభ్యుల పై రామా రావు ఇమ్మానేని అనే సీనియర్ న్యాయవాది తెలంగాణ లోకాయుక్త లో గత యాడాది అక్టోబర్ నెలలో ఫిర్యాదు చేసిన సంగతి విదితమే, అట్టి ఫిర్యాదును విచారణ చేపట్టిన గౌరవ లోకాయుక్త గారు ఫిర్యాదుదారుడు తెలియచెప్పిన అవినీతి మరియు ఆదాయానికి మించిన ఆస్తులు మొదలగు విషయాలను పరిగణలోకి తీసుకొని, తెలంగాణ రాష్ట్ర విజిలెన్సు మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారిని దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవలసిందిగ ఉత్తరువులు జారీ చేసింది