తెలంగాణ వీణ, చింతలపూడి : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు రాజనీతి శాస్త్ర అధ్యాపకులు కె.హరి ప్రసాద్ గారు ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమ అధ్యక్షులు కళాశాల ప్రిన్సిపల్ డా.పి.శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ దేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 2011లో ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా 2011లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవాలి అని ఇందుకోసం జనవరి 25, వ తేదీని ఎంచుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25 న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అని ఈ సంవత్సరం అంటే 2024లో భారత్ తన 14,వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటోంది అని
బ్రిటీష్ పాలనలో 200 సంవత్సరాల బానిసత్వం తర్వాత భారత్ 1947లో స్వాతంత్రం పొందింది. మూడేళ్ల తర్వాత, అంటే 1950 జనవరి 26,న దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దేశంలో ఎన్నికల సంఘాన్ని జనవరి 25, 1950న స్థాపించారు. దీంతో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడానికి జనవరి 25 ని ఎంచుకున్నారు అని తెలియచేసారు. వైస్ ప్రిన్సిపల్ నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ఏ దేశమైనా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఓటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేసేందుకు ఓటు పనిచేస్తుంది అనితెలిపెను.హరి ప్రసాద్ గారు మాట్లాడుతూ దేశంలోని యువతను ఓటు వేయమని ప్రోత్సహించడం, ఓటరు జాబితాలో కొత్త ఓటర్లను చేర్చడం జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రధాన లక్ష్యం అని తెలియచేసినారు. ఈ కార్యక్రమములో అధ్యాపకులు దేవానంద్ గారు,శ్రీనివాస్ గారు,సంతోష్ గారు,సుందర్ గారు ఇతర అధ్యాపక,అధ్యాపాకేతర మరియు విద్యార్దిని,విద్యార్ధులు పాల్గొనడం జరిగినది.