తెలంగాణ వీణ, దెందులూరు : ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వసంతవాడ గ్రామంలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ చెందిన సిద్ధార్థ విద్యాలయ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. మెయిన్ రోడ్ లో ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు పక్కన ఉన్న ఒక నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లింది. నివాస ప్రాంతాలకు చెందిన ఇల్లు దెబ్బతింది. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు చెబుతున్నారు. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు జరిగిన సంఘటనలో ఒకసారిగా గ్రామం ఉలిక్కిపడింది. దీనిపై డ్రైవర్ తీరుని కోరగా ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి ప్రమాదం జరిగింది అంటున్నాడు. పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉం