తెలంగాణ వీణ, అచ్చంపేట : పేద విద్యార్థుల కు అన్ని విదాలుగా ఇండియఃన్ రెడ్ క్రాస్సొసైటీ నాగర్ కర్నూల్ జిల్లా సెక్రేటరీ రమేశ్ రెడ్డి అన్నారు. గురువారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఆధ్వర్యంలో అచ్చంపేట బాలసదన్ చిన్నారులకు దుప్పట్లను పంపిణి చేశారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ బాలసదన్ లోని 50 మంది కి దుప్పట్ల పంపిణీ చేయడం జరిగిందని, చిన్నారుల చదువుకు అవసరమైన పుస్తకాలు , నోటు బుక్స్ , వైద్య సేవలలాంటివి ఏవిధమైన సహాయం అవసరమైన రెడ్ క్రాస్ ఎప్పుడు ముందు ఉంటుందని ఈ సంద్భంగా ఆశ్రమ నిర్వాహకులకు సూచించారు. చిన్నారులు మరింత బాధ్యతతో ఇష్టపడి చదివాలని, మీరు కూడా మరింత మందికి సేవ చేసే ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం లేనిటి ఫౌండేషన్ లోని వృద్ధాశ్రమం లోని వృద్దులకు దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ శ్రీధర్, యూత్ రెడ్ క్రాస్ జిల్లా కన్వీనర్ కుమర్, రెడ్ క్రాస్ సభ్యులు అశోక్ ప్రసాద్, లోక్య నాయక్, కృష్ణ రావు, హన్మంత్ , చైల్డ్ వెల్ఫేర్ కమిటి సభ్యురాలు ప్రసన్న, డి.సి.టి.ఓ. నీరంజన్ , సుదర్శన్, బాలసదన్ నిర్వాహకులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్25ACPT03 ; బాల సదన్ లో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న రెడ్ క్రాస్ సభ్యులు