తెలంగాణ వీణ, ఏపీ బ్యూరో : సమాజ అభివృద్ధికి జర్నలిస్టులు పాత్ర కీలకంగా ఉంటుందని పత్రిక విలేకరులు తమ వృత్తి పట్ల వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని ఏలూరు జనసేన నాయకులు బివి రాఘవయ్య చౌదరి, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ డి అబ్రహం జిల్లా పంచాయతీ శాఖ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్ లు అన్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఆంధ్రప్రదేశ్ జిఎస్ 9టీవీ తెలంగాణ వీణ యాజమాన్యం మరియు ఉభయ గోదావరి జిల్లాల జిఎస్ 9టీవీ విలేకరుల సమావేశం ఏలూరులోని హోటల్ గ్రాండ్ ఆర్య ఫంక్షన్ హాలులో బుధవారం ఏపీ ఎస్ ఎస్ డైరెక్టర్ అబ్రహం అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సమాజంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పత్రికా రూపంలో ప్రభుత్వానికి తెలియజేసి జర్నలిస్టులు చేస్తున్నారని జర్నలిస్టులు చేస్తున్న సేవలను రాఘవయ్య చౌదరి కొనియాడారు జిల్లా పంచాయితీ శాఖ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ విలేకరు వృత్తికి వన్నెతెచ్చే విధంగా పనిచేయాలని ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండాలని సూచించారు ప్రభుత్వానికి ప్రజలకు వారిది గా విలేకరులు కష్టపడుతున్నారని ఆయన అన్నారు ఏపీ ఎస్ ఎస్ డైరెక్టర్ అబ్రహం మాట్లాడుతూ సమాజంలో ఉన్న సమస్యలను వెలికి తీసి వార్తా రూపంలో అధికారులకు తెలియచెప్పే బాధ్యత గల పనిని విలేకరులు చేస్తున్నారన్నారు ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికిను కష్టాలు కూడా లెక్కచేయకుండా పత్రికా ప్రతినిధులు పనిచేయటం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు ప్రస్తుత ఆధునిక కాలంలో నూతన టెక్నాలజీతో జిఎస్ 9టీవీ తెలంగాణ వీణ పత్రికను ఛానల్ ను స్థాపించి నిర్వహించడం గర్వకారణమని కొనియాడారు అధు నూతన టెక్నాలజీ తో నిర్వహిస్తున్న నైన్ టీవీ ఛానల్ యాజమాన్యాన్ని అతిధులు ప్రశంసించారు అనంతరం ఉభయ గోదావరి జిల్లాల నుండి వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన పత్రిక విలేకరులతో పలు అంశాలను యాజమాన్యం చర్చించారు నూతనంగా వచ్చిన పత్రిక రిపోర్టర్లకు 9టీవీ ఛానల్ రిపోర్టర్లకు లోగోను ఐడి కార్డులను అందించారు 2024 క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిఎస్ 9టీవీ యాజమాన్యం వీ శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు , కే శ్రీనివాసరావు , వి వి గంగాధర్ రావు లు పాల్గొన్నారు రానున్న ఎన్నికల ప్రక్రియలో వార్తలను అందించే విధానంలో పలు సూచనలను యాజమాన్యం విలేకరులకు తెలియచెప్పారు ఈ కార్యక్రమంలో చీఫ్ నేటూరి గోపాలకృష్ణ కార్యాలయ ఇంచార్జ్ కే డేవిడ్రత్నం రాగోలు సురేష్ రవికుమార్ పలు నియోజకవర్గాల రిపోర్టర్లు మండల స్థాయి రిపోర్టర్లు పాల్గొన్నార