తెలంగాణవీణ, హైదరాబాద్ : మాజి మంత్రి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త.ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి,మాణిక్ రావులు . మాజి ముఖ్యమంత్రి కేసిఅర్, మాజి మంత్రి హరీష్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ఎమ్మెల్యేలు .పార్టి అధినేత కేసిఅర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఅర్, మాజి మంత్రి హరీష్ రావులకు తెలిసే కలిసారా లేక తెలియక కలిసారా అనేది హాట్ టాపిక్…. ఓవైపు లండన్ పర్యటనలో సిఎం రేవంత్ రెడ్డి బిఅర్ఎస్ పార్టి పై చాలా హాట్ హాట్ కామెంట్స్ చేసారు…. వంద మీటర్ల లోతు బిఅర్ఎస్ పార్టి ని బొంద పెడతానని సంచలన వ్యాఖ్యలు చేసాడుఇక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి 39 ముక్కలు చేస్తామన్నారు… మాతో 30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అన్నారు…. రాష్ట్రంలో బిఅర్ఎస్ పార్టి గెలిచిన ఎమ్మెల్యేలకు లేని సెక్యూరిటీ, ప్రోటోకాల్ సమస్య మెదక్ జిల్లా వాళ్లకే వస్తుందా…. అసలు సిఎం రేవంత్ రెడ్డి ని బిఅర్ఎస్ పార్టి ఎమ్మెల్యేలు కలవడం వెనక మతలబు ఏంటి…అంతా హరీష్ రావు కనుసన్నల్లోనే జరుగుతుందా…దీనిపై పార్టి అధినేత కేసిఅర్ గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఅర్ గానీ, మాజి మంత్రి హరీష్ రావు లు గానీ ఎందుకు రియాక్ట్ కాలేదు….నిజంగానే మెదక్ జిల్లాతోనే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసిందా