తెలంగాణవీణ, ఏలూరు : మూడో విడత ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు, పెదపాడు మండలంలోని 29 గ్రామాల గుండా 10 రోజుల పాటు సుమారు 200 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు nవైయస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇంఛార్జ్ శ్రీ కారుమూరి సునీల్ కుమార్ గారు మరియు ఇతర ప్రముఖ నాయకులతో కలిసి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు కొత్తూరుకు చేరగానే అక్కడి ప్రజలు, పార్టీ శ్రేణులు మేళ తాళాలతో ఘనంగా ఆహ్వానం పలికారు. ముందుగా ఎమ్మెల్యే గారు గ్రామంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని అనంతరం పాదయాత్రను ప్రారంభించారు ఊరంతా మారుమ్రోగేలా జై జగన్, జై కొఠారు అనే నినాదాలతో అబ్బయ్య చౌదరి గారి పాదయాత్ర ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. ప్రతి చోట ఆడపడుచుల హారతులు అందుకుంటూ, ప్రజలను ఆత్మీయంగా పలుకరిస్తూ ఎమ్మెల్యే గారు పాదయాత్రను కొనసాగించారు. కొత్తూరు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన బడి నాడు – నేడు ఫెజ్ 2 కింద కోటి 29 లక్షల రూపాయల తో నిర్మించిన అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం చేసి, ఎమ్మెల్యే గారు పాదయాత్రగా తాళ్ళగూడెం చేరగా, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు తాళ్ళగూడెంలో ఎమ్మెల్యే గారు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి మరియు వైయస్ఆర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, సభను ఉద్దేశించి మాట్లాడారు తాళ్ళగూడెంలో ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ, జగనన్న అందించిన సంక్షేమం మరియు అభివృద్ధిని వివరిస్తూ గ్రామ వీధుల్లో పాదయాత్ర చేసి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు కొత్తముప్పర్రు గ్రామానికి చేరారు కొత్తముప్పర్రు గ్రామంలో ఎమ్మెల్యే గారికి ప్రజలు హారతులు పట్టి ఆత్మీయ స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా తనకు బస ఏర్పాటు చేసిన ఇంటికి చేరి మూడో విడత మొదటి రోజు ప్రజా ఆశీర్వాద యాత్రను ముగించారు.