తెలంగాణవీణ, విశాఖ : నిన్నటి అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రామభక్తులు పలు పూజలు ఇతర క్రతువులు నిర్వహిస్తూ రాములవారిపై తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఇక విశాఖకు చెందిన స్కూబా డైవర్లు ఏకంగా సముద్రం అడుగున రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం రిషికొండ బీచ్‌లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రంలో 22 అడుగుల లోతున అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమనా్ని నిర్వహించారు. రాముడిపై బలమైన విశ్వాసం, సంప్రదాయానికి ఈ కార్యక్రమం చిహ్నమని స్కూబా డైవర్లు పేర్కొన్నారు. భక్తిపారవశ్యపు అలల్లో తమ మనసు ఓలలాడిందని వారు వ్యాఖ్యానించారు.