తెలంగాణ వీణ, మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే- ఐ జె యు )మేడ్చల్ జిల్లా నుంచి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా తోకల మల్కయ్య, రవీందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల అధికారి బాలబోయిన విజయకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఎన్నికల్లో… మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి తోకల మల్కయ్య, రవీందర్ రెడ్డిల నామినేషన్లు దాఖలు అయ్యాయి. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా తోకల మల్కయ్య, రవీందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇక మేడ్చల్ జిల్లా నుంచి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన తోకల మల్కయ్య, రవీందర్ రెడ్డిలకు పలువురు పాత్రికేయులు అభినందనలు తెలిపారు.