తెలంగాణవీణ,మంచిర్యాల : ఈనెల 21న హైదారాబాద్ లోని మోక్షంగుండం విశ్వేశ్వరయ్య భవన్లో లో తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ బి.బాబన్న పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రం లోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర రాష్ట్ర సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బి, బాబన్న మాట్లాడుతూ రాష్ట్ర సదస్సులో రాష్ట్ర విభజన జరిగి దశాబ్ద కాలం దాటవస్తున్నా విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ రెండు మార్లు రాష్ట్రాన్ని పాలించినా తమ స్వంత రాజకీయ ప్రయోజాలకే పరిమితం అయిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి విభజన హామీలు అమలయ్యేలా చేయాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకు రాష్ట్ర సదస్సుకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి యువత, మేధావులు, ఉద్యమ కారులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ బాబన్న సూచించారు. మరియు వివిధ పార్టీ ల నుంచి తుడం దెబ్బ ఆదివాసి నాయకులు పెందుర్తి దర్మ్, రమేష్ చంద్ర, అంజయ్య,ఎస్ జాన్ , జి సుదాకర్,ఆరేల్లి అంజిత్, వేముల ప్రేమ్ సాగర్, విరిని రాష్ట్ర ఆర్గనైజ్ సేక్రటరీ బి బాబన్న పార్టీ కండువ కప్పి పార్టీ లోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామచంద్రరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి గోనెల శ్రీనివాస్, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు ప్రధీప్, యువజన అద్యక్షులు సిరాజ్, రాష్ట్ర సోషల్ మీడియా సభ్యులు పాములవెంకటసాయి , టిజేఎస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి , తదితరులు పాల్గోన్నారు.