తెలంగాణవీణ , హైదరాబాద్ : పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గళాన్ని గట్టిగా, స్పష్టంగా వినిపించేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనంటూ ట్వీట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అదే ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మార్చుకోవడం ద్వారా తీగ తెగిందని పేర్కొన్నారు. గత పదేళ్లలో మీ బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ ప్రజల కోసం ఏనాడు పార్లమెంట్లో గొంతెత్తలేదని విమర్శించారు. 2024లో లోక్ సభ ఎన్నికల్లో ఒక్క లోక్ సభ స్థానంలోనూ గెలిపించకుండా తెలంగాణ ప్రజలు మీ పార్టీతో ఉన్న బంధాన్ని కూడా తెంచేసుకుంటారని వ్యాఖ్యానించారు. కాగా, అంతకుముందు… రానున్న లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్కు తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? అని వివరిస్తూ ఓ ట్వీట్ చేశారు. దీనికి రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు.