తెలంగాణ వీణ , ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు, సంక్రాంతి మరుసటి రోజు ‘కనుమ’. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలు పంచు కోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతే కాదు, వన భోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, వడలు చేసుకోవడం ఆనవాయితీ. పండుగలు మన హైందవ జీవన స్రవంతిలో ప్రముఖ భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ వున్నాయి. ప్రతి పండుగ వెనుక తప్పక ఒక సందేశం దాగి వుంటుంది. వైజ్ఞానికంగా మన మహర్షులు ఎంతో పరిశోధించి ఏర్పరచిన ఈ పండుగలన్నీ మానావాళికి హితాన్ని బోధించేవే. అని మంచి కంటి రాజ వర్ధన్ అన్నారు