తెలంగాణవీణ, హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మంగళ్‌హాట్‌లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజా విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజాను విక్రయిస్తున్న 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరంతా ఢిల్లీ నుంచి చైనా మాంజా తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గత మూడు రోజుల నుంచి మాంజా దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.