తెలంగాణవీణ , సినిమా : సీరియల్స్, సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా పాపులర్ అయిన అందాల భామ లహరి శ్రీ. బిగ్ బాస్ ద్వారా బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది. కొన్ని చిన్న సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించే ఛాన్స్ లు సొంతం చేసుకుంది. ఓ విధంగా చాలా మంది నటీమణులకి బిగ్ బాస్ మంచి ఫేమ్ తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ని బిగ్ బాస్ పెంచిందని చెప్పాలి. అయితే ఈ షో నుంచి బయటకి వచ్చిన తర్వాత లహరి శ్రీ మీడియాకి దూరంగా ఉంటుంది. కాని ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఫ్యాన్స్ కి అందుబాటులోనే ఉంటుంది. రెగ్యులర్ గా తనకి సంబందించిన ఫోటోలని షేర్ చేసుకుంటుంది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తెలుగమ్మాయిలు కూడా గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదనే సంగతి తెలిసిందే.ఇన్ స్టాగ్రామ్ లో చాలా మంది అందాల భామలు రెగ్యులర్ గా హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన అరియానా గ్లోరి, ఆషురెడ్డి, దివి వాదిత్యా, సిరి హనుమంతు లాంటి తెలుగమ్మాయిలు గ్లామర్ బ్యూటీస్ గా మారిపోయారు. సినిమాలలో కూడా అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు.