తెలంగాణవీణ , సినిమా : ఆర్‌జేగా జీవితాన్ని ప్రారంభించిన బాలాజీ ఆ తరువాత హాస్యనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తరువాత కథానాయకుడిగా అవతారం ఎత్తి ఆపై మెగాఫోన్ పట్టి సక్సెస్ అయ్యారు. ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సింగపూర్ సెలూన్. గోకుల్ దర్శకత్వంలో వేల్స్ ఫిలిం పతాకంపై ఐసరీ గణేష్ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, సత్యరాజ్, లాల్, జీవా, దర్శకుడు లోకేష్ కనకరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు.వీరితో పాటు ఒక ప్రముఖ నటుడు కీలక పాత్రను పోషించినట్లు దర్శకుడు చెప్పారు. వివేక్ మెర్విన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 25న తెరపైకి రానుంది. సింగపూర్ సెలూన్ చిత్రం సెన్సార్ బోర్డు నుంచి యూ సర్టిఫికెట్ పొందడం విశేషం. ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందింది.