తెలంగాణ వీణ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలో కోడిపందాలు భారీగా జరిగాయి. ఏలూరు కృష్ణ, ఈస్ట్, పశ్చిమ, గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణాలైనా ప్రాంతాలలో భారీగా కోడిపందాలు సెట్టింగులు వేసి నిర్వహించారు. కోడిపందాలు భారీగా జరిగాయి, లక్షలాది రూపాయలు చేతులు మారిన వైనం ఎక్కడ ప్రాంతాలలో నెలకొంది. దూర ప్రాంతాల నుంచి హైదరాబాదు వంటి మహానగరాలు సైతం గోదావరి జిల్లాల్లో పందాలు కాయడానికి ముందుకు వచ్చారు. మద్రాస్ నుంచి సైతం కూడా జిల్లాల్లో కోడిపందాలకు రావడం విశేషం లక్ష నుంచి కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క కోడిపందాలలో చేతులు మారిన పరిస్థితి నెలకొంది. వేలాదికారులు వేలాది వాహనాలు ఈ యొక్క కోడిపందాల ప్రాంగణాల కు బారులు తీరాయి. సంక్రాంతి పండగ రోజుల్లో మొదలుకొని ఈ నాలుగు రోజులు పాటు కోడిపందాలు భారీగా జరుగుతున్న పరిస్థితి ఏర్పడింది. ముందుగా పర్మిషన్ లేవని కోడిపందాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని చెప్పినటువంటి పోలీస్ శాఖ చివర్లో చేతులు మూసుకున్న పరిస్థితి ఏర్పడింది. కోడిపందాలను నిర్వహించకూడదని అన్ని పోలీస్ శాఖ కార్యాలయాల్లో శాంతిభద్రతులపై కఠిన చర్యలు చేసినప్పటికీని పండుగ మొదలుకొని చివరకు పందాలు ఆడుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాజకీయ వత్తిడి వలన పోలీస్ శాఖ చూసి ఉన్నట్లుగా వ్యవహరించడం జరుగుతున్న పరిస్థితి. ఈ ప్రాంతాలలో ఉంది పేకాట, రమ్మి ,కోడిపందాలు, వంటి ఆటలు జరుగుతున్న పరిస్థితి ఉంది. మత్తు పానీయాలు సైతం స్థావరాలలో ఏర్పాటుచేసి పందాలు నిర్వహిస్తున్నార