తెలంగాణ వీణ, ఉప్పల్: శుక్రవారం మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ లోని తిరుమలనగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాఠశాల గ్రౌండ్ నందు నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. ఈ పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన ముగ్గురు విజేతలకు స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పాల్గొన్న అందరి విద్యార్థినులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఉపాద్యాయులు, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లేశ్ గౌడ్, సెక్రటరీ అమరేంద్ర బాబు మరియు శ్రీనివాస రావు, మురళీకృష్ణ, రంగసాయి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.