తెలంగాణ వీణ, ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గంలో చిల్కానగర్ డివిజన్ స్వామి వివేకానంద జయంతి సందర్బంగా చిలుకనగర్ కూడలిలో గల వివేకానందుని విగ్రహానికి పూల మాలలు వేసి
జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు .
కార్యక్రమంలో పాల్గొన్నవారు బిజెపి సీనియర్ నాయకులు శామీర్పేట్ ధర్మారెడ్డి మాట్లాడుతూ నేటి యువత స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలని ఉత్తమమైన మార్గాలను నడవడానికి స్వామి చేసిన బోధనలు యువత పాటించాలని అన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు మార్నేని ఫనీందర్, నియోజకవర్గ కన్వీనర్, బాలచందర్, రాష్ట్ర గీత సెల్ కన్వీనర్ పంజాల శ్రవణ్ గౌడ్, చిలకనగర్ డివిజన్ అధ్యక్షులు గొనె శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, నరేందర్, సాయి, సునీల్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.