తెలంగాణ వీణ, కుత్బుల్లాపూర్: యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి కుత్బుల్లాపూర్ ఉమ్మడి బాలానగర్ మండలాల ఉపాధ్యాయుల పలు దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలపై మండల విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు 1.ఎన్నికలలో పాల్గొన్న ఉపాధ్యాయుల ఆర్జిత సెలవులు 2.పబ్లిక్ పరీక్షల్లో అందరికీ విధుల కేటాయింపు 3.ఉపాధ్యాయులకు ఎగ్జామినేషన్ డ్యూటీ మరియు మూల్యాంకనంలో సమన్యాయం తదితర సమస్యలపై వారికి వివరించి దరఖాస్తు పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జయసింహారెడ్డి ఉపాధ్యక్షురాలు వందన ముఖ్య కార్యదర్శి రమేష్ కుమార్ కోశాధికారి ఉపేందర్ మరియు సహా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.