- భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
తెలంగాణ వీణ,భద్రాద్రి కొత్తగూడెం : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డివైఎఫ్ఐ)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆవిష్కరించారు. ఎస్పీని డివైఎఫ్ఐ ప్రతినిధి బృందం బుధవారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి శాలువాసతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యా వైద్యం కోసం మంచి ప్రవర్తన కోసం సమాజ మార్పు కోసం యువకులు ఎలాంటి పాత్ర పోషించాలో అందుకు తగ్గ యువకుల్ని తయారు చేసే దానికోసం డివైఎఫ్ఐ ముఖ్యపాత్ర పోషించాలని పేర్కొన్నారు. దేశ స్వాతంత్రం కోసం సమాజ మార్పు కోసం పాటుపడిన మహనీయుల్ని స్మరించుకుంటూ ముద్రించిన క్యాలెండర్ చాలా బాగుందని అభినందించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లిక్కి బాలరాజు కాలంగి హరికృష్ణ డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరభద్రం నవీన్ నాగకృష్ణ రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.