తెలంగాణ వీణ ,ఉప్పల్ : రేణుక ఎల్లమ్మ దేవస్థానం రాఘవేంద్ర నగర్ లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఎన్నికల ముందు ఇదే ఆలయంలో ఎన్నికల్లో విజయం సాధించాలని మొక్కుకోవడం జరిగింది కోరుకున్నట్లుగానే ఉప్పల్ నియోజకవర్గం నుండి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచిన సందర్భంగా మోక్కు తీసుకోవడానికి మంగళవారం రేణుక ఎల్లమ్మ టెంపుల్ కి రావడం జరిగింది.ఆలయ కమిటీ సభ్యులు బండారు లక్ష్మారెడ్డి కి స్వాగతం పలికి సత్కారం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జన శేఖర్ ఆలయ కమిటీ సభ్యులు సిఎస్ మల్లేష్ రామ్ రెడ్డి సత్తయ్య ముత్యం రెడ్డి యాదగిరి అశ్వద్ధామ రెడ్డి కట్ట బుచ్చన్న గౌడ్ సంజన్న తదితరులు పాల్గొన్నారు