Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ యాజమాన్యాల కోర్ కమిటీ ఎన్నిక

Must read

  • ప్రజా ప్రభుత్వానికి అభినందన కృతజ్ఞత సభ
  • ముఖ్య అతిథులుగా కే.కోటేశ్వర్ రావు,
    తెలంగాణ వీణ , హైదరాబద్ : సిచ్.వి చలపతి రాజు, అనంచిన్ని వెంకటేశ్వరావు
    తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనం
    నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి అభినందన, కృతజ్ఞత సభ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి సభాధ్యక్షతను ఎన్ 24 న్యూస్ టీవి మీడియా టుడే టీవీ అధినేత కే.కోటేశ్వర్ రావు (కే.కే.ఆర్) వహించారు.ముఖ్య అతిథులుగా న్యూస్ 9 టుడే అధినేత సిచ్.వి.చలపతి రాజు, ఏడబ్యూజెఏ, ఎక్స్ క్లూజివ్ టివి అధినేత
    అనంచిన్ని వెంకటేశ్వరావుపాల్గొన్నారు.
    కేబుల్ టీవీ యాజమాన్యాల హక్కులు, పరిష్కారాల గురించి ఆహ్లాదకరమైన వాతావణంలో ప్రభుత్వంతో చర్చించి కోర్ కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలును ప్రతి కేబుల్ టీవీ తీసుకుంటుందని, నూతన ప్రజాస్వామిక ప్రభుత్వానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, ఇప్పటికైనా ప్రభుత్వంతో చర్చించి, ఒప్పించి ప్రభుత్వ ప్రకటనలు కేబుల్ టీవీ యాజమాన్యాలకు అందే విధంగా ఉండాలని కోర్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంటుందని సభ తీర్మానించింది.
    తెలంగాణలోని అన్ని
    ప్రెస్ క్లబ్ లలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడే వారికి మాత్రమే అవకాశం కల్పించాలని, కానీ చాలా ప్రాంతాల్లో అలా జరగడం లేదని, కొన్ని ప్రెస్ క్లబ్ లలో మద్యంతో పిచ్చలవిడిగా జల్సాలు చేస్తూ జర్నలిస్టు వృత్తికి అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని, దీనిని పూర్తిగా ఖండిస్తూ త్వరలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి చేపట్టే ఉద్యమానికి తమమ మద్దతు ఉంటుందని వారు తెలిపారు. ప్రెస్ క్లబ్ కేవలం జర్నలిస్టుల సంక్షేమానికి, జర్నలిస్టులకు కోసమే పని చేయాలని, వారి మనోభావాలను దెబ్బ తినకుండా చూడాలని వారు సూచించారు. త్వరలో ఈ విషయాలపై తెలంగాణ జర్నలిస్టుల సమాజాన్ని ఏక తాటిపైకి తీసుకువస్తామని వారు తెలిపారు.
    కోర్ కమిటీ సభ్యులుగా…
    కే.కోటేశ్వర్ రావు, హెచ్.వి.చలపతి రాజు, అనంచిన్ని వెంకటేశ్వరావు, ఎం.రవి కుమార్, కృష్ణంరాజు, జితేందర్, దేవేందర్, రవీందర్, సాజితా సికిందర్, సిహెచ్. శ్రీనివాస్ రావు, బ్రహ్మాం, గిరి, రవికుమార్ తదితరులు ఉన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you