తెలంగాణ వీణ,భద్రాద్రి :
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకి నయీమ్ ఖురేషి కార్యాలయంలో రెల్లి సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా జిల్లా సిపిఐ కార్యదర్శి సాబీర్ పాషా, నయీమ్ ఖురేషికి సైతం ఘన సన్మానం నిర్వహించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ రెల్లి సంఘం వారికీ కమ్యూనిటీ హాల్, కిన్నరసాని తాగునిటీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ సెక్రటరీ సాబీర్ పాషా తో పాటు నయీమ్ ఖురేషి, దుర్గాప్రసాద్, గంగాధర్ రావు, గణేష్, సాంబ, నర్సింహా, కళ్యాణి వెంకటేశ్వర్లు, రెల్లి సంఘం పెద్దలు పాల్కొన్నారు.