తెలంగాణవీణ ,సినిమా : సంక్రాంతికి అక్కినేని ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు వినోదాల విందు పంచేందుకు నా సామి రంగ అంటూ నాగార్జున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా కూడా అక్కినేని ఫ్యాన్స్ కి ప్రత్యేకమైన కానుక దక్కబోతోంది.అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. అయినా కూడా చాలా మంది ప్రేక్షకులు ఏజెంట్ ను ఓటీటీ ద్వారా చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.ఏజెంట్ సినిమా కొన్ని కారణాల వల్ల స్ట్రీమింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఏజెంట్ సినిమాను సోనీ లివ్ ఈ జనవరి 26న స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడ్డ ఏజెంట్ సినిమా ను ఈసారి సోనీ లివ్ రిపబ్లిక్ డే సందర్భంగా అక్కినేని ఫ్యాన్స్ కోసం తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.