Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 తెరపై పెరుగుతున్న తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్!

Must read

తెలంగాణవీణ , సినిమా : ఒకప్పుడు తెలుగు తెరపై తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ కథల హవా కొనసాగింది. ఆ తరువాత కాలంలో ఈ తరహా కాన్సెప్ట్ లు ఎక్కువగా రాలేదు. మళ్లీ ఇప్పుడు అవే తరహాలో తండ్రీకూతుళ్ల ఎమోషనల్ బాండింగ్ తో సినిమాలు వస్తున్నాయి. ‘భగవంత్ కేసరి’ సినిమాలో నిజమైన తండ్రీ కూతుళ్లు కాకపోయినా, బాలకృష్ణ – శ్రీలీల అవే స్థానాల్లో కనిపిస్తారు. వారి మధ్య అదే బాండింగ్ ఉంటుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సిద్ధార్థ్ హీరోగా చేసిన ‘చిన్నా’ సినిమాలో అతను బాబాయ్ అయినప్పటికీ, తండ్రి స్థానంలోనే కనిపిస్తాడు. తమిళంలో ఆ సినిమా భారీ విజయాన్ని సాధించగా, తెలుగులోను మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక రీసెంటుగా వచ్చిన ‘హాయ్ నాన్న’ సినిమా కూడా తండ్రీకూతుళ్ల నేపథ్యంలో వచ్చిన కథనే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను మంచి లాభాలను సొంతం చేసుకుంది. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you