తెలంగాణ వీణ ,ఉప్పల్ : శనివారం మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ తిరుమలనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు మరియు సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. ఈ ముగ్గుల పోటీల్లో విద్యర్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులతో పాటు పాల్గొన్న అందరి విద్యార్థినులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశామని అన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యతో పాటు ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారి ప్రతిభను గుర్తించడమే కాకుండా వారి అభివృద్ధికి ఎంతో ఉపయోగంగా ఉంటుందనీ, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు రాకేష్, అనితరాణి, అరుణాదేవి, గాయత్రి, సరిత, హరిష్చంద్ సిబ్బందితో పాటు స్థానిక నాయకులు గడియారం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.