. అందరూ చల్లగా ఉండాలిఛైర్మన్ గుర్రాల శ్రీధర్
తెలంగాణ వీణ , మంచిర్యాల : మంచిర్యాల ..విద్యుత్ వెలుగులు.. టపాసుల మోతలు.. యువత కేరింతల నడుమ నూతన సంవత్సర స్వాగత వేడుకలు ప్రారంభమయ్యాయి.. ఆదివారం జైపూర్ మండలం దుబ్బపల్లి లోని డైమండ్ సిటీ వేదికగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. ‘ హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ యావత్ అంజనీపుత్ర సంస్థ కుటుంబ సభ్యులు, అభిమానులు వేడుకలు అపూర్వ రీతిలో డాన్సులతో వేడుకలు నిర్వహించారు..కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. బాణసంచా వెలుగుల్లో శోభాయమానంగా మెరిసిపోయాయి.. విద్యుతీప కాంతుల్లో దగదగలాడాయి.ఈ సందర్భంగా అంజనేపుత్ర సంస్థ ఛైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి మాట్లాడుతూ గత ఏడాది జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు..అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ రంగంలో ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా గొప్పపేరు ప్రఖ్యాతులు సంపా దించుకోవడం అదృష్టమన్నారు. జిల్లా వ్యాప్తంగా సేవా కార్య క్రమాలు విస్తృత స్థాయిగా నిర్వహించు కోవడం లో ప్రతి ఒక్కరి భాగ స్వామ్యం మరువలేనిదని పేర్కొన్నారు.2024 నూతన సంవత్సరం లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, ఐశ్వర్యాలతో విలసిల్లాలని కోరారు.అనంతరం చైర్మెన్ గుర్రాల శ్రీధర్ కేకు కట్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమం లో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, డైరెక్టర్ లు, సిబ్బంది పాల్గొన్నారు.