తెలంగాణ వీణ , సినిమా : టాలీవుడ్ లో కొత్త వారసులు ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల మరియు ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే రోషన్ బబుల్ గమ్ సినిమా విడుదల అయ్యింది. ఇక సునీత తనయుడు ఆకాష్ సర్కారు నౌక్రి సినిమాతో రాబోతున్నాడు. రోషన్ ను యాంకర్ సుమ ఏ స్థాయిలో ప్రమోట్ చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. గత రెండు మూడు నెలలుగా బబుల్ గమ్ సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు. బిగ్ బాస్ మొదలుకుని చాలా షో ల్లో సుమ స్వయంగా హాజరు అయ్యి తన కొడుకును పరిచయం చేసింది. దాంతో బబుల్ గమ్ కి మంచి పబ్లిసిటీ దక్కింది సుమ స్థాయిలో తన కొడుకు సినిమా ప్రమోషన్ కోసం సునీత మీడియా ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకటి రెండు కార్యక్రమాల్లో మినహా సునీత ఎక్కువగా సర్కారు నౌక్రీ సినిమా గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇలా ఎందుకు జరిగింది అంటూ స్వయంగా మీడియా వారు ఆకాష్ ను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు. సర్కారు నౌక్రి సినిమాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కండోమ్స్ ను ప్రచారం చేస్తూ ఉంటాడు. కండోమ్స్ వినియోగం గురించిన కాన్సెప్ట్ తో సినిమా రూపొందింది. ఇది ఒక కమర్షియల్ సినిమా కాదు. ఎంతగా ప్రచారం చేసినా కూడా కాన్సెప్ట్ ప్రేక్షకుల్లోకి వెళ్తేనే ప్రచారం దక్కుతుంది. కనుక మేము ఎక్కువగా ఈ సినిమాను ప్రచారం చేయలేదని హీరో ఆకాష్ పేర్కొన్నాడు.