- నూతన భూగర్భ గనుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తాం
- కార్మికులు అప్పగించిన భాద్యతను విస్మరించబోము
- 5 షాఫ్టు మైన్ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
తెలంగాణ వీణ, భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణి సంస్థ పరిరక్షణ మనుగడ కార్మికుల సంక్షేమమే లక్ష్యంతో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) పని చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా స్పష్టం చేశారు. గురువారం వీకే.5 మెనులో జరిగిన పిట్ సమావేశంలో అయన పాల్గొని మాట్లాడారు. కార్మికుల పక్షాన ఉండి కార్మికులు సంస్థ కోసం పోరాడే సంఘం ఏఐటీయూసీ మాత్రమేనని కార్మికులు గుర్తించారని అన్నారు. ప్రస్తుత గత సర్కారు సంఘాలను బుద్ధి చెప్పి సింగరేణి కార్మికుల మనుగడను కాపాడే సంఘానికి కార్మికులు పట్టం కట్టారని వారి నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తామని అన్నారు. నూతన భూగర్భ గనులు ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామని కార్మిక హక్కులను కాపాడతామని అన్నారు. ఎన్నికల సమయంలో కార్మికుల ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయిస్తామని అన్నారు. బొగ్గు బావులను వేలం వేయించే విధానానికి స్వస్తి పలికే విధంగా పాలకులపై వత్తిడి తెస్తామని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ గుర్తింపు సంఘానికి సహకరించాలని అందించాలని కోరారు. ఏఐటీయూసీని గుర్తింపు సంఘంగా గెలిపించిన కార్మికవర్గానికి అయన కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలుపొందడంపై సంబురాలు చేశారు. శేషగిరిభవన్ ఆవరణలో బాణాసంచా కాల్చి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వరకు ప్రదర్శన నిర్వహించారు. సమావేశంలో యూనియన్ నాయకులు వట్టికొండ మల్లికార్జున్ రావు, బందెల నర్సయ్య, జె.గట్టయ్య, సియాద్రి నాగేశ్వర్ రావు, ఉమాయున్, కత్తెర రాములు, భూక్యా రమేష్, సందెబోయిన శ్రీనివాస్, మురాజ్ తదితరులు పాల్గొన్నారు.