కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి ఘనమైనా వేడుకలు నిర్వహించి సంబరాలు జరుపుకున్న మండల కాంగ్రెస్ నాయకులు…
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ అభయ హస్తం ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానున్నది…
తెలంగాణ వీణ, ములుగు : ఏఐసీసీ మహిళ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి సూచనల మేరకు నియోజకవర్గ కోర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ అయుబ్ ఖాన్ గార్ల అధ్యక్షతనలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిటమట రఘు, మండల ప్రధాన కార్యదర్శి వాలిలాల ఎల్లయ్య, టౌన్ అధ్యక్షులు ఎండీ సులేమాన్ గార్ల ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 139 వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా ఘనమైనా వేడుకలు నిర్వహించి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి కాంగ్రెస్ నాయకులు కేక్ కటింగ్ చేసి ఆనందాన్ని పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నా జిల్లా, మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు.
ఈ సందర్బంగా మండల అధ్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ 139 సంవత్సరాల చరిత్ర కలిగిన గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ, గత బిఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పరిపాలనలో అర్హులకు ఒక్క రేషన్ కార్డు అమలు చెయ్యలేదని , డబులు బెడ్ రూమ్ ఇండ్ల పంపిణి నిర్వహించలేదని నేడు కాంగ్రెస్ పార్టీ 139 వ ఆవిర్భావ సందర్బంగా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి విషయం కాంగ్రెస్ ప్రజా పాలన లో ప్రజల వద్దకే అధికారులు వచ్చి దరఖాస్తులు స్వీకరించి ప్రజల వద్దనే గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక అర్హులైన వారిని అక్కడే నిర్ణయించడం జరుగుతుందని, నేటి నుంచి మహాలక్ష్మి,రైతు భరోసా,గృహజ్యోతి, రేషన్ కార్డు,ఇందిరమ్మ ఇండ్లు ,చేయూత వంటి పథకాలకు దరఖాస్తు పక్రియ జనవరి 06వ తేది వరకు ప్రతి గ్రామ పంచాయతీలో నడుస్తుందని అర్హులైనా ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోగలరని మండల కాంగ్రెస్ పార్టీ తరుపున కోరుతున్నామని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే నెరవేర్చుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, బ్లాక్ నాయకులు,మండల నాయకులు,మండల అనుబంధ సంఘాల నాయకులు,గ్రామ నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకురాలు, సర్పంచ్ లు,ఎంపీటీసీ లు, వార్డ్ సభ్యులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.