ప్రతి గడప గడపకు ప్రత్యేక అధికారులతో ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకారణ..
తెలంగాణ వీణ, ములుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు నేడు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ములుగు జిల్లా కంతనపల్లి మరియు చింతగూడెం గ్రామములో ప్రజా పాలన అభయహస్తం 6 గ్యారంటీ ల దరఖాస్తు స్వీకారం కార్యక్రమాన్ని ప్రారంభించిన కన్నాయిగూడెం మండల జడ్పీటీసీ నామ కరం చందు గాంధీ మండల్ ఎంపీపీ జనగాం సమ్మక్క వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్ మండల్ ఇంచార్జి జాడి రాంబాబు మండల్ ఎంపీడీఓ ఎపిడి స్పెషల్ ఆఫిసర్ ఎమ్మార్వో డిప్యూటీ ఎమ్మార్వో ఎయ్
ఈ సందర్భంగా మండల్ జడ్పీటీసీ మాట్లాడుతూ
ప్రజాపాలన గ్రామ, వార్డు సభలను కట్టుదిట్టంగా నిర్వహించాలి
డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణ. దరఖాస్తుదారునికి రూపాయి ఖర్చు కాకుండా చర్యలు. ప్రతి రోజు రెండు షిఫ్టులలో ప్రజాపాలన గ్రామసభల నిర్వహణ. మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలి. ప్రతి మండలంలో అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి దరఖాస్తుదారునికి 4 నుంచి 5 నిమిషాల సమయం కేటాయించాలి. దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు. ప్రజా పాలన కార్యక్రమంలో అధికారుల ది ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైంది. ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమం స్థానిక సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు గ్రామ కార్యదర్శిలు గ్రామ వార్డ్ మెంబెర్స్ ప్రజా ప్రతినిధులు అంగన్వాడీలు ఆశ వర్కర్స్ గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.