తెలంగాణవీణ, కాప్రా : రాష్ట్ర వ్యాప్తంగా అభయహస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గురువారం జీహెచ్ఎంసీ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ వార్డ్ కార్యాలయంలో స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ లబ్ధిదారులకు లాంఛనంగా దరఖాస్తులను అందజేశారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతన రేషన్ కార్డ్,ఫించన్,గృహ లక్ష్మి,మహాలక్ష్మి,చేయూత వంటి పథకాల కోసం అప్లై చేసుకొని రశీదు ను జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు. లబ్దిదారులు దరఖాస్తు ఫారంలో వివరాలు నింపడంతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ జతచేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ కార్యాలయ అధికారులు,ప్రజా పాలన ఆధికారులు,డివిజన్ నాయకులు పాల్గోన్నారు.