తెలంగాణ వీణ , హైదరాబాద్ : మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ దుబాయ్‌కి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు తొలుత ముంబైకి, ఆ తర్వాత అక్కడి నుంచి దుబాయ్ కి పరారైనట్టు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. నిన్న లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.