తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రవి ఆత్మహత్య చేసుకున్నారు. నాలుగున్నరేళ్లపాటు తిరుమల దర్శన వ్యవహారాలు చూసుకున్న ఆయన గత రాత్రి ఇంట్లో ఉరివేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని రవి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు.