తెలంగాణ వీణ, వరంగల్ : వరంగల్ రామన్నపేట లోని డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగు సాహిత్య కళా ఉత్సవాలకు గోపాలపురానికి చెందిన చాగంటి మంజుల పాల్గొన్న సందర్భంగా ట్రస్ట్ వారు చాగంటి మంజులను ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా షష్టి డాక్టర్ ఎ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పురాతన కాలం నుండి రాజులు కళాకారులను, కవులను పోషించేవారు. వీరి ద్వారా మానసిక ఉత్తేజాన్ని, ఆహ్లాదకరమైనటువంటి మనసును కలిగింపజేస్తాయి అని తెలిపారు.చాగంటి మంజుల ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన శ్రీశ్రీ కళావేదిక సాహిత్య కళా ఉత్సవాలు లో1200 మంది కవులు, కళాకారులు 33 గంటల 33 నిమిషాల 33 సెకండ్ల తో జరిగిన కార్యక్రమం. ఐదు ప్రపంచ రికార్డులు సాధించిన ఉత్సవాలలో చాగంటి మంజుల పేరు నమోదైనందుకు చాలా గర్వకారణమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్ట్ తో పాటు ట్రష్టి ఏ. భారతి, కోఆర్డినేటర్ వారణాసిమోహన్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పరికిపండ్ల వేణు, శ్రవణ్ కుమార్, యుగంధర్ మరియు ఉపాధ్యాయురాలు సుమలత తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.