తెలంగాణ వీణ, ఏపీ బ్యూరో : అంతర్జాతీయ స్థాయిలో 72 మంది తెలుగు వెలుగులకు, సంస్థలకు ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రతిష్టాత్మక ” పూర్ణకుంభ పురస్కారాలను’ ప్రకటించింది. ఆంధ్ర సారస్వత పరిషత్ మరియు చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గైట్ కళాశాల ప్రాంగణంలో 5,6,7 జనవరి 2024 తేదీలలో నిర్వహించబడుతున్న 2 వ అంతర్జాతీయ తెలుగు మహాసభలలో భాగంగా 5 జనవరి 2024 సా.5.00 గం. ల నుండి సా.7 గం. ల వరకు ప్రతిష్టాత్మక “పూర్ణకుంభ పురస్కారాలను” ప్రదానం చేయనున్నట్లు డా.గజల్ శ్రీనివాస్ , చైతన్య రాజు , రెడ్డప్ప ధవేజిలు తెలిపారు. ముఖ్య అతిథిగా అశ్విని కుమార్ చౌబే, కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖా మంత్రివర్యులు , విశిష్ట అతిధిగా జస్టిస్ బి.కృష్ణమోహన్ లు పాల్గొంటారని తెలిపారు
పూర్ణకుంభ పురస్కార గ్రహీతలు –
కీర్తిశేషులైన తెలుగు వెలుగుల కుటుంబాలు
- దివ్యశ్రీ తరిగొండ వెంగమాంబ, భక్తి సాహిత్యం
- దివ్యశ్రీ కవి మొల్ల, భక్తి సాహిత్యం
- దివ్యశ్రీ కవి తిక్కన సోమయాజీ, ఆంధ్ర పురాణ సాహిత్యం
- దివ్యశ్రీ డొక్కా సీతమ్మ, ఆధ్యాత్మిక సేవా రంగం
- దివ్యశ్రీ గుర్రం జాషువా , సాహిత్యం
- దివ్యశ్రీ శ్రీపాద కృష్ణమూర్తి, ఆధ్యాత్మిక సాహిత్యం
- దివ్యశ్రీ మధునాపంతుల సత్యనారయణ శాస్త్రి, తెలుగు సాహిత్యం
- దివ్యశ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు, సాహిత్య & సేవ రంగాలు
- దివ్యశ్రీ పెద్దింటి దీక్షిత్ దాసు, హరికథ
- దివ్యశ్రీ దామోదరం సంజీవయ్య, ప్రజాసేవ
- దివ్యశ్రీ బోయి భీమన్న, తెలుగు సాహిత్యం
- దివ్యశ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు, ప్రజాసేవ
- దివ్యశ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు, చలనచిత్ర సంగీతం
- దివ్యశ్రీ మండలి వెంకట కృష్ణారావు , తెలుగు భాషా సేవ
- దివ్యశ్రీ సాలూరి రాజేశ్వరరావు, చలనచిత్ర సంగీతం
- దివ్యశ్రీ పి. బి. శ్రీనివాస్, చలనచిత్ర సంగీతం
- దివ్యశ్రీ బసవరాజు పద్మనాభం, చలనచిత్రం
- దివ్యశ్రీ బాపు, చలనచిత్రం & చిత్రలేఖనం
- దివ్యశ్రీ జంధ్యాల, రంగస్థల నాటక రచన & చలనచిత్రం
- దివ్యశ్రీ సి. వి. రాఘవాచారి, పత్రికా రంగం
- దివ్యశ్రీ తుర్లపాటి కుటుంబరావు, పత్రికా రంగం
- దివ్యశ్రీ జాలాది రాజారావు, తెలుగు సాహిత్యం
- దివ్యశ్రీ కాళీపట్నం రామారావు, తెలుగు సాహిత్య సేవ
- దివ్యశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చలనచిత్ర సాహిత్యం
- దివ్యశ్రీ డా. దాసరి నారాయణరావు, చలనచిత్రం
- దివ్యశ్రీ సురభి జమున రాయలు, సురభి రంగస్థలం
- దివ్యశ్రీ పాతపాటి సర్రాజు, ప్రజాసేవ
- దివ్యశ్రీ వై. కె. నాగేశ్వరరావు, సాంస్కృతిక సేవ
- దివ్యశ్రీ పరవస్తు చిన్నయ సూరి, తెలుగు భాషా వికాసం
పూర్ణకుంభ పురస్కారాలు – రాజ వంశీకులు - మైలవరం సంస్థానాదీసులు
- చింతపల్లి సంస్థానాదీసులు
పూర్ణకుంభ పురస్కార తెలుగు వెలుగులు
32 బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ, తెలుగు వాఙ్మయం
- ఆచార్య శలాక రఘునాథ శర్మ, తెలుగు వాఙ్మయం
- శ్రీ దాట్ల బుచ్చి వేంకటపతి రాజు, సేవా రంగం
- శ్రీ జిత్ మోహన్ మిత్ర, కళా సేవారంగం
- శ్రీ తల్లావఝుల పతంజలి, సాహిత్యం
- డా. ఎల్లూరి శివారెడ్డి, సాహిత్యం
- శ్రీ రసరాజు, సాహిత్యం
- శ్రీ తనికెళ్ళ భరణి, చలనచిత్రం
40 శ్రీ వేదాంతం రాధే శ్యామ్, కూచిపూడి నృత్యం - శ్రీ కూచిభొట్ల ఆనంద్, భారతీయ సంస్కృతి సేవ
- శ్రీ బాదం బాలకృష్ణ, సేవారంగం
- శ్రీ కె. టి. రామరాజు, సేవారంగం
- డా. కె.సుధాకర్ రెడ్డి, వనితా రెడ్డి, అంతర్జాతీయ సేవారంగం
- డా. టి.గౌరి శంకర్, తెలుగు భాషా సేవ
- శ్రీ వడలి రమేష్ కుమార్, అంతర్జాతీయ సేవారంగం
- శ్రీ మహ్మద్ ఆలీ, చలనచిత్రం
- శ్రీ కె. వి. ప్రదీప్, తెలుగు బుల్లితెర
- శ్రీమతి అన్నాబత్తుల నాగమణి, రంగస్థలం
- శ్రీ ఆలూర్ అశోక్ కుమార్, తెలుగు బుల్లితెర
- శ్రీమతి గోగినేని శిల్ప, గాత్రదానం & బుల్లితెర
- శ్రీ చెరుకువాడ రంగ సాయి, సాహిత్యం
పూర్ణకుంభ పురస్కారాలు – పత్రికలు , సాహితీ సాంస్కృతిక సంస్థలు
- స్వాతి పత్రిక – శ్రీ వేమూరి బలరాం – తెలుగు పత్రిక
- కళ పత్రిక – శ్రీ మహ్మద్ రఫీ – తెలుగు పత్రిక
- తెలంగాణ సారస్వత పరిషత్ – శ్రీ డా. చెన్నయ్య
- వంశీ ఇంటర్నేషనల్ – శ్రీ వంశీ రామరాజు
- రసమయి – శ్రీ యమ్. కె. రాము
- కిన్నెర – శ్రీ మద్దాలి రఘురాం
- ముంబై తెలుగు సంఘం – శ్రీ బి.సహదేవ్
60 ముంబై తెలుగు కాళాసమితి – శ్రీ మాదిరెడ్డి కొండారెడ్డి - కువైట్ కళాసమితి – శ్రీ పెండ్యాల వేంకటేశ్వరరావు
- అమెరికా తెలుగు అసోసియేషన్ – శ్రీ జి. రామచంద్రా రెడ్డి
- సిల్వాస తెలుగు సంఘం – శ్రీ కంబాల ఆదికాశి విశ్వేశ్వర రావు
- సాహితి సంస్థ , గుంటూరు – శ్రీ సింగం లక్ష్మీనారాయణ, శ్రీ పి. రామచంద్ర రాజు
- నవ్యాంధ్ర రచయితల సంఘం – శ్రీ కలిమిశ్రీ
- ప్రకాశం జిల్లా రచయితల సంఘం – ఒంగోలు
- హనుమంతురాయ గ్రంధాలయం – విజయవాడ
- గౌతమి గ్రంధాలయం – రాజమహేంద్రవారం
- నన్నయ్య భట్టారక పీఠం – తణుకు
- సేవ సంస్థ – నెల్లూరు
- చింతలూరు ఆయుర్వేద ఫార్మసి – చింతలూరు